Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులు వడ్లను దళారులకు అమ్మి మోసపోవద్దు
- పీఎసీఎస్‌లో మొదటి వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
- ఎక్కువ భూమి ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి పెట్టండి
- ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ- నర్వ
రైతులు ఆర్ఎన్ ఆర్, బీపీటీి, తదితర రకాల వరినే కాకుండా కొత్త రకం వడ్ల ను పండించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి సూచించా రు. గురువారం మండలంలోని పీఎసీఎస్ ఆధ్వర్యంలో చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మణ్‌లతో కలిసి వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తను కూడా ప్రస్తుతం చిట్టి ముత్యాలు, గంగోత్రి అనే కొత్త రకం వారిని సాగుచేసి సీడ్ తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దిగుబడి అన్నిరకాల మాదిరిగా నే వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏ గ్రేడ్ రకానికి 2060, బీ గ్రేడ్ రకానికి 2040 రూపాయల మద్దతు ధరను చెల్లించి వడ్లను కొనుగోలు చేస్తుంద న్నారు. రైతులు బయట దళారులకు తక్కువ ధరలకు అమ్మి మోసపోవద్దన్నారు. ప్రస్తుతం యాసంగి సాగుకోసం రైతులు ఏర్పాట్లు చేసుకుంటారని అన్నారు. భూ త్పూరు రిజర్వాయర్ నుంచి నీటిని ఒకనెలపాటు వదలకుండా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. నీటిని విడుదల చేసే షట్టర్ మరమ్మతు ఉన్నందువలన నీరు వృథాగా పోతుందని అధికారుల వద్ద మాట్లాడి పనిపూర్తి చేయించిన అనంతరం నీటిని వదులుతామని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాల్వకింద నారుమడ్లు చేసు కునే రైతులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకొని నారుమడులు చేసుకో వాలన్నారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే యథావిధిగా నీటిని వదులు తామని అన్నారు. నియోజకవర్గంలోని మండలంలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించా మని, ఈ అవకాశాన్ని మండలంలోని ఆయా గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఆయిల్ఫామ్ సాగుకు మంచి డిమాండ్ ఉందని రైౖతులు ఆయిల్ ఫామ్‌ను సాగుచేసుకుని అధిక దిగుబడులు పొంది లాభాలు ఆర్జించవచ్చన్నారు. ఉన్న పరిస్థితులలో ఆయిల్ ఫామ్ ఏర్పాటుకు ప్రభుత్వాలు డ్రిప్పుపై సబ్సిడీలు, మొక్కలపై సబ్సిడీలు ఇస్తుందన్నారు భూమి ఎక్కువ ఉన్న రైతులు ఆయిల్ ఫామ్సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కే జయరాములు శెెట్టి, రైతుబంధు మండలాధ్యక్షుడు చిన్నయ్య, టీఆర్ఎస్ మండల నాయకులు కిరణ్ ప్రకాష్ రెడ్డి, దండు శంకర్, ఏవో గణేష్ రెడ్డి, పీఎసీఎస్ సిబ్బంది జగదీశ్వర్‌రెడ్డి, ఉదయ్ కుమార్, నరసింహ, సునీల్, ఆయా గ్రామాల ఏఈవోలు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.