Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ జె రంజన్ రతన్ కుమార్
నవతెలంగాణ- ధరూర్
పోలీస్ వృత్తి అత్యంత కఠినతరమైనదని, చలి, ఎండ, వానలను లెక్క చేయకుండా, విధులు నిర్వహించాల్సి ఉంటుందని పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ జె రంజన్ రతన్ కుమార్ అన్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమంకోసం తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి తీసుకుంటున్న వివిధ చర్యలలో భాగంగా సిబ్బంది కోసం వచ్చిన రెయిన్ కోట్స్, చలికి తట్టుకునే జర్కిన్స్, జిల్లా పోలీస్ సాయుధ దళ కార్యాలయంలో గురువారం ఎస్పీ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పోలీస్ సిబ్బందికి ఇటీవల నిర్వహించిన ఆధునాతన వైద్యపరీక్షలను గుర్తు చేస్తూ, ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ సీహెచ్ రంగస్వామి, సాయుధ దళ డీఎస్పీ ఇమ్మానియోల్, కార్యాలయ ఏవో సతీష్ కుమార్, డీసీ ఆర్బీ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్, సీఐ చంద్రశేఖర్, ఆర్ఐ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.