Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వీపనగండ్ల
రైస్ మిల్లును రైతులందరూ సద్వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.మండల పరిధిలోని కల్వరాల గ్రామ సమీపంలోశ్రీ లక్ష్మీ శ్రీనివాస్ ఇండిస్టీ లిస్ట్ రైస్ మిల్లు ను గురువారం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల కోసం రైస్ మిల్లును ఏర్పాటు చేయడం దీన్ని రైతులందరూ సద్వినియోగి ంచుకోగలరని కోరారు. రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యం కల్పించాలని నిర్వాహకులకు డిమాండ్ చేశారు. అనంతరం కల్వరాళ్ల గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభం చేశారు.కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వరరావు, పానగల్ సింగల్ విండో చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, తుంకుంట సింగిల్ విండో చైర్మన్ రామన్ గౌడ్ ,వైస్ చైర్మన్ సరిత సర్పంచులు రఘునాథ్ రెడ్డి ,విజరు కుమార్ రామేశ్వరరావు, వీపనగండ్ల ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, తుంకుంట సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఎద్దుల సురేందర్ రెడ్డి, కోఠిరెడ్డి, వేణుమాధవ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి వైయస్ వెంకటయ్య, కురుమయ్య, సాయిరాం, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎండి సర్దార్ పాల్గొన్నారు.