Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కొత్తకోట
గ్రామాల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యం అవుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం కొత్తకోట మండలం పాలెం గ్రామంలోని కొత్తకోట మండలం పాలెం గ్రామంలో 5 లక్షల విలువలతో కూడిన ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణానికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాలు పల్లెలు మరింత అభివృద్ధి జరుగుతున్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. దళితులకు అండగా ముఖ్యమంత్రి ఉన్నాడని అన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దళిత బందు తీసుకొచ్చాడని అన్నారు. దళితులు ఇప్పుడే అభివృద్ధిలోకి వస్తున్నారని అన్నారు. ముందుగా గ్రామ శివారులో నందకం రెస్టారెంట్ ను ప్రారంభించారు.ఆ తర్వాత కొత్తకోట పట్టణ కేంద్రంలో ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ల షోరూంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేషవ రెడ్డి, పామపురం సింగిల్ విండో అధ్యక్షుడు వాసుదేవ రెడ్డి, కో ఆప్షన్ అల్లబాష, జిల్లా అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్, పాలెం మైబు, మోహన్ కుమార్, అలీం, శ్రీనుజి, వెంకటన్న గౌడ్, అంజి, వెంకటయ్య, మన్యం, కిరణ్, బలస్వామి పాల్గొన్నారు.