Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆత్మకూర్
ఆత్మకూరు మండల పరిధిలోని బాలకిష్టాపురం సమీపంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర గల వ్యవసాయ పొలం నందు వరి చేను గడ్డిని తీసుకు వెళ్లేందుకు వచ్చిన వాసులకు ట్రాక్టర్ గడ్డివాము చేర్చి రోడ్డుపైకి తెస్తున్న సందర్భంలో మధ్యలో గల కరెంట్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగి ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. వెంబడి ఆత్మకూరు పట్టణానికి చెందిన అగ్నిమాప కేంద్రానికి ఫోన్ చేయడంతో వారు వచ్చి దాదాపు గంటపాటు శ్రామించి మంటలను నియ ంత్రించారు. 15 వేల రూపాయల గడ్డి కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సంజీవరెడ్డి ,గోపాల్ రెడ్డి ,వెంకట్ స్వామి, మోహన్, తదితరులు పాల్గొన్నారు.