Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్దుబాటులో భాగంగా బాధ్యతలు అప్పగించిన డీడబ్ల్యూఓ
వనపర్తి :'సఖి' కేంద్రంలో సామాజిక, మానసిక కౌన్సిలర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీవాణిని ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ రంగంలోని బాలల సంరక్షణ కేంద్రం భాగంలో పని చేసేందుకు జిల్లా సంక్షేమ అధికారిణి పుష్పలత గురువారం బాధ్యతలు అప్పగించారు. 2019 నుంచి సఖి వన్ స్టాఫ్ సెంటర్లో సామాజిక, మానసిక కౌన్సిలర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సఖికి వచ్చే మహిళల సమస్యలను పరిష్కరించడంలో కీలకపోత్ర పోషించారు. క్లిష్టమైన సమస్యల్లో నుంచి మహిళల్లో ఆత్మస్తైర్యాన్ని నింపి, వారిలో మానిసికంగా, సామా జికంగానూ చైతన్యపర్చడంలోనూ, ఎన్నో కుటుం బాలను ఒక్కటిగా చేసి వారి కాపురాలను నిల బెట్టడంలోనూ శ్రీవాణి కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే ఆమె సేవలను గుర్తించిన కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, డిడబ్ల్యువో పుష్పలతలు ప్రభుత్వ రంగంలోని బాలల సంరక్షణ కేంద్రంలో పని చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో డిడబ్ల్యువో సమక్షంలో శ్రీవాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు.
మహిళా సమస్యలపై సుదీర్ఘ సేవలు
శ్రీవాణి మొదటి నుంచి మహిళా సమస్యలపై సుదీర్ఘంగా సేవలందించారు. పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన శ్రీవాణి 2000 సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం వివాహం చేసుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పని చేయాలన్న సంకల్పంతో 2006లో 15 మందితో మహిళా సంఘం ఏర్పాటు చేశారు. 200లో గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలుగా, 2008లో డిగ్రీ పూర్తి చేయడంతో పాటు మండల మహిళా అధ్యక్షురాలిగా పని చేశారు. 2010లో ఉమ్మడి జిల్లా సమాఖ్య ఈసీగా 2011లో ఉమ్మడి జిల్లా మహిళా సమాఖ్య ఆడిట్ ఫైనాన్స్ మెంబర్‌గా పని చేశారు. 2012లో పీజీ పూర్తి చేశారు. 2013లో ఎన్పీఎంగా సీఏగా పని చేశారు. బిజినేపల్లి మండలంలో రైతు సంఘాలను బలోపేతం చేశారు. 2014లో జిల్లాలో పోలీస్ స్వచ్ఛంద ఫ్యామిలీ కౌన్సిలర్‌గా పని చేశారు. 2016లో జైళ్ల డీజీ ప్రోత్సాహంతో సిటిజన్ ఫోరం కమిటీలో జిల్లా, రాష్ట్ర కమిటీ మెంబర్‌గా పని చేశారు. 2018లో మహిళా హాస్టల్ ఏర్పాటుతో పాటు కానిస్టేబుల్స్ అభ్యర్థినీలకు ఫిజికల్ కోచింగ్ ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేశారు. 2018 జూన్‌లో ఆర్డిఎస్ ఐఎల్పి, అంగన్వాడీ, హైస్కూల్లో బాలికల, మహిళలకు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. 2019 నుంచి సఖి వన్ స్టాఫ్ సెంటర్లో మహిళా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారు. ఆమె ప్రభుత్వ రంగాల్లో సఖీ కేంద్ర ఉద్యోగులు అభినంధనలు తెలిపారు.