Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - వనపర్తి
సమాజంలో మహిళలపై పెరుగుతున్న హంస, వివక్ష నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారిణి పుష్ఫలత కోరారు. గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 'అంతర్జాతీయ మహిళ హింసకు, వివక్ష నిర్మూలన' పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవంబర్ 25 నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు నిర్వహిస్తున్న 'అంతర్జాతీయ స్థాయిలో మహిళలపై హింస, వివక్ష నిర్మూలన'కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు. 15 రోజుల పాటు అంతర్జాతీయ మహిళా హింసకు వ్యతిరేక పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. మహిళల వెట్టి చాకిరీ వ్యవస్థను రూపుమాపాలని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె అన్నారు. పిల్లల పెంపకంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. ధైర్యంగా నిలబడి పోరాటం చేసిన స్త్రీ మూర్తులను ఆదర్శంగా తీసుకోవాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ మగవారితో సమానంగా స్త్రీలకు గౌరవం అందేలా మగ పిల్లలను పెంచాలని ఆయన అన్నారు. మహిళలు వేధింపులకు, హింసకు గురైనప్పుడు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, షి టీమ్ ద్వారా రక్షణ పొంది సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. వేధింపులు జరిగిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతారని ఆయన తెలిపారు. వనపర్తిలో సఖి కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నదని ఆయన తెలిపారు. మహిళలు చాలా శక్తివంతులని ఆయన అన్నారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. సఖి కేంద్రంలో 1324 కేసులు నమోదు కాగా, 1139 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా సమస్యలను పరిష్కరిస్తున్న సఖి కేంద్రం నిర్వాహకులను, డిడబ్ల్యుఓ పుష్పలత, చెన్నమ్మ థామస్‌లను ఆయన అభినందించారు. సిడబ్ల్యూసి చైర్మన్ అలివేలమ్మ మాట్లాడుతూ మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రవీందర్, సిడబ్ల్యూసి ఆలివేలమ్మ, చెన్నమ్మ థామస్, డిఎంహెచ్ఓ రవి శంకర్, సఖి నిర్వాహకులు, సఖి కేంద్రం సిబ్బంది, మహిళా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.