Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వీపనగండ్ల
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర రెండవ మహాసభలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ఆంజనేయులు అన్నారు. మండల పరిధిలోని సం సంగి నే ని పల్లి గ్రామంలో డిసెంబర్ 29 30 31 తేదీలలో ఖమ్మం పట్టణంలో జరుగు రాష్ట్ర రెండవ మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు.ఈ సందర్భంగా మేకల ఆంజనేయులు మాట్లాడుతూ వ్యవసాయ కూలీల స్థితిగతుల అంశంపై మరియు కూలి రేట్ల పెంపు కోసం ఉపాధి పనితీరులను పెంపు కోసం వలస కూలీల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సంగి నేనిపల్లి గ్రామ సర్పంచ్ ఆర్ మౌలాలి ప్రజాసంఘాల నాయకులు రామచంద్రయ్య గౌడ్ రాముడు కోటయ్య ముత్యాలు రాజు నారాయణ తదితరులు పాల్గొన్నారు.