Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- కృష్ణ
ఏలాంటి అనుమతులు, సరైన ధ్రువపత్రాలు లేని బూడిద తరలిస్తున్న వాహనాలను శుక్రవారం మండల సరిహద్దులో ఉన్న చెక్‌పోస్ట్ అధికారులు తనిఖీ చేసి 13టిప్పర్లను సీజ్‌చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న కర్ణాటకరాష్ట్రంలోని శక్తినగర్ పవర్‌ప్లాంట్ నుంచి విడుదలయ్యే బూడిదను సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇటుక బట్టిలకు నిత్యం కృష్ణ మండలం మీదుగా వేల బూడిద లారీలు మహబూబ్‌నగర్, జడ్చర్ల కర్ణాటకలోని యాదగిరి, కల్బుర్గి దూర ప్రాంతాలకు బూడిదను తిప్పర్ల ద్వారా తరలిస్తుంటారు. ఓవర్‌లోడ్, ఓపెన్ టాప్ ద్వారా తరలిస్తున్న బూడిదలోడు లారీలను ఏలాంటి ధ్రువపత్రాలు లేని టిప్పర్లను శుక్రవారం రాష్ట్ర సరిహద్దున ఉన్న చెక్‌పోస్ట్ ఆర్టీవో తనిఖీచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారని లారీల వేట్ ఆధారంగా ఆర్టీవో చలాలనులను విధించి తర్వాత వదులుతారని కృష్ణ ఎస్సై విజయభాస్కర్ తెలిపారు.