Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు ఆర్. సాయిబాబా
నవతెలంగాణ -ధరూర్
జిల్లా కేంద్రంలోని ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో పాతబస్టాండ్ ఆవరణం నుంచి భారీఎత్తున కార్మికులు పాల్గొని భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. దేశ సంపదను సృష్టించేంది కార్మికులు బోగాలు అనుభవించేది కార్పొరేట్లని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు ఆర్ సాయిబాబా అన్నారు. దేశ సంపదను సృష్టించేది కార్మికుల ఐతే వారి శ్రమను దోచుకొని భోగాలు అనుభవించేది మాత్రం కార్పొరేట్ శక్తులు అని విమర్శించారు. ఆదివారం సీఐటీయూ రెండో జిల్లా మహాసభల సందర్భంగా తెరు మైదా నం నుంచి పట్టణ పురవిధుల గుండా ర్యాలీ నిర్వహించి స్థానిక ఇండియన్ ఫంక్షన్ హల్లో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగాహాజరై మాట్లాడారు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం కష్టపడి సంపదను సష్టిస్తే వారి నుంచి దోచుకొని కార్పొరేట్ శక్తులకు ఈ ఒక్క సంవత్సరం లోనే రుణాల పేరుతో సబ్సిడీల పేరుతో అప్పనంగా అప్పజెప్పారన్నారు. ఇవి కాక ప్రజలు పొదుపు రూపంలో బ్యాంకులో దాచుకున్న డబ్బును బడా బాబులకు అప్పజెప్పి ప్రభుత్వ బ్యాంకులను దివాలా తీశారన్నారు. సం పదను సృష్టించిన కార్మిక వర్గం కనీస వేతనాలు లేక అల్లాడుతుంటే దేశం లోని ప్రజా ప్రతినిధులు మాత్రం సిగ్గు లేకుండా వారి వేతనాలు పింఛన్లు పెంచుకుంటున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఒక్కొక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని కార్మికుల హక్కులు కాపాడుతామని ఎన్నో హామీలు ఇచ్చారని అన్నారు. దేశంలో అవినీతి గణనీయంగా పెరిగిందని దీంతో కార్మికవర్గం తన సంపదను కోల్పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికులు హక్కులకోసం ఉద్యమించిన ప్రతిసారి ప్రజల మధ్య కులం, మతం ప్రాంతం పేర విభజనలు సృష్టిస్తూ సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ అయిన కార్మికులు హక్కులు సాధించారంటే అది పోరాటాలు ఉద్యమాల ద్వారానే అని గుర్తు చేశారు. కార్మికులు సంపద సృష్టికర్తలని పోరాడి సాధించుకున్న హక్కులకోసం సమరసీల పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అఖిల భారత ఉపాధ్యక్షుడు సాయిబాబా జెండా విష్కరణ చేశారు. ఈ మహాసభలలో అమరుల పి.బాలకిష్టయ్యగౌడ్, మౌలాలికి నివా ళులర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.జయలక్ష్మి, ఆర్.కోటం రాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ. వెంకటస్వామి, నర్సింహా, రాములు, రఘు, నర్సింహులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.