Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ధరూర్
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మౌత్సవాలు పురస్కరించుకొని అన్నదాతల ఆత్మీయ సంబరాల బ్రోచర్లును ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమెహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా అన్నదాతల ఆత్మీయ సంబరాలు ఎద్దుల బల ప్రదర్శన నిర్వహి స్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి దర్శనానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్నదాతల ఆత్మీయ రైతు సంబరాలకు తనవంతు సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారున. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్, వైస్ ఎంపీపీ వీరన్న, మండల అధ్యక్షుడు వెంకటన్న, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచ్ యాకోబు, కౌన్సిలర్ కృష్ణ, ఆలయం కమిటీ డైరెక్టర్ శంకర్, నాయకులు సత్యంరెడ్డి, విక్రమ్ సింహరెడ్డిరెడ్డి, కృష్ణారెడ్డి, అజయ్, చంద్రశే ఖర్‌రెడ్డి, నరేందర్, మధు, భాస్కర్, కిష్టప్ప, నర్సింహులు, తిమ్మరాజు, పరుశ రాముడు, భగీరథ వంశీ, రిజ్వాన్, వీరేష్, ప్రభాకర్, బద్రి తదితరులు పాల్గొన్నారు.
వివాహ వేడుకల్లో పాల్గొన్న గొంగళ్ల రంజిత్ కుమార్
నవతెలంగాణ- ధరూర్
మహబూబ్‌నగర్‌లోని అన్నపూర్ణ గార్డెన్లో ఆదివారం సీపీఎం రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్ కుమార్తె వివాహానికి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంగారు, రాష్ట నాయకులు జాన్ వెస్లీ, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ హాజరై నూతన వధూవరులకు అక్షిం తలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు, మల్దకల్ మండల నాయకులు గోపాల్, సుదర్శన్ పాల్గొన్నారు.