Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదు
నవ తెలంగాణ -వంగూరు
మండలంలోని నిజాంబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు పెద్దమొత్తంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పులిజాల కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రజా విశ్వాసం కోల్పోయిన విపక్షాలు ఇక ఎంతోకాలం మనుగడ సాగించలేవని టీఆర్ఎస్లో చేరడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్, అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తుందన్నారు. గ్రామాలాభివృద్ధి, పేదరిక నిర్మూలన రైతుసంక్షేమ అభివృద్ధి దేశంలో మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు రూపొందించి అమలు చేస్తుందని తెలిపారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన విపక్షాలు ప్రతిదీ రాజకీయం చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి నిరోధకంగా మారాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని శక్తి అని సీఎం కేసీఆర్ పాలన దక్షతను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలస్వామి సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు అంకూరి అంజి, జిల్లా నాయకుడు లాలుయాదవ్, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్ సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, గణేష్‌రావు, నారాయణరావు, ఆనంద్‌రెడ్డి, నర్సిరెడ్డి, అంజి, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.