Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
- ఎల్లమ్మ దేవాలయనిర్మాణానికి భూమి పూజ
నవతెలంగాణ - తెలకపల్లి
ఆధ్యాత్మికతతోనే శాంతియుత జీవనం సాధ్యమని ప్రవ్యక్తి తోటి వారికి సాధ్యమైనంత సహాయ, సహకారాలను అందించాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలపరిధిలోని కారువంగాలో నూతనంగా ఏర్పాటుచేయనున్న రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి ఎంపీ పోతుగంటి రాములతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదప్రజలకు వివిధసంక్షేమ పథకాల ఏర్పాటుతోపాటు, మన పూర్వికుల ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా దేవాలయాల అభివృద్ధి నూతన ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొమ్ము మధు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదుల నరేందర్‌రెడ్డి, సర్పంచ్ గాజుల లక్ష్మీదేవి స్వామి, ఎంపీటీసీ నారాయణమ్మ, రైతుబంధు మండలాధ్యక్షుడు జి మాధవరెడ్డి, సింగిల్ విండో వైస్‌చైర్మన్ యాదయ్య, గ్రామపెద్దలు పులికాశన్న, నీరేష్, లింగస్వామి, బాలయ్య, రాము, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.