Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -కందనూల
బీసీ బిల్లు పెట్టి బీసీల జనాభా తమాషా ప్రకారం విద్యా ఉద్యోగ పారిశ్రామిక రాజకీయ రంగాలలో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీసీలను ఇంకా ఎంతకాలం ఓటు బ్యాంకు వాడుకుంటా రని పార్టీలను సూటిగా ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లు పెంచక పోతే బీసీల తి రుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈడ బ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెంచినట్టుగానే బీసీల రిజర్వేషన్లు పెం చాలన్నారు. దశాబ్దాల కాలం కాలయాపన చేయకుండా రిజర్వషన్లు పెంచి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ జనగణనలో బీసీ కుల గణన చేసి బీసీలకు దక్కాల్సిన వాటా బీసీలకు ఇవ్వాల న్నారు. బీసీ ఉద్యోగుల మెడపై వేలాడుతున్న క్లిమిలేర్ విధా నాన్ని రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచకుండా 26 కులాలను బీసీ జాబితాలో చేర్చాలన్న ప్రతిపాదన విరమించుకోవాలన్నారు. ఈ ప్రతిపాదన మూలంగా బీసీలకు యువకులకు బీసీ నిరుద్యోగులకు తీవ్ర నష్టం వాటిలనుందని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాలైన తమిళ నాడులో 69శాతం చతిస్గడ్ 74శాతం కేరళ కర్ణాటకలో రాష్ట్రాల్లో కూడా 50శాతం పైగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇదే విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆత్మగౌరవ భవనాల పేరుతో బీసీలను విభజించి పాలిస్తున్నారని బీసీలు ఐక్యమత్యంగా కలిసి ఉంటే అధికారం బీసీల చేతుల్లోకి వెళుతుందని భావించి విభజించి పాలిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం పై కుంభం మల్లేష్ గౌడ్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాళ్ల నిరంజన్, జిల్లా కన్వీనర్ రవీందర్‌గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్ గౌడ్, తిరుపతయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మూ లంటి వెంకటేశ్వర్లు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, నాయ కులు గంగోజి, కొట్ర శ్రీనివాసులు, పరమేష్, ఆంజనేయులు పాల్గొన్నారు.