Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి
- 48 గంటల వంట వార్పు ప్రారంభం
నవతెలంగాణ- మహబూబ్నగర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు తక్కువ వేతనాలు ఇస్తూ వారి శ్రమను దోచుకుంటోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి ఆరోపించారు. ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురు వారం కొత్త కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన 48 గంటల వంటవార్పు కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆశలకు పారితోషికం పేరుతో రూ.3,000, 5000, 6000 ఇస్తూ ప్రభుత్వం వారి శ్రమను దోచుకుంటోందని ఆరోపించారు. ఒక వైపు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చినా ఎక్కడ కూడా అమలు కావడం లేదన్నారు.
రాష్ట్రంలో ఆశలు పని ఒత్తిడితో షుగర్ , బీపీ వంటి రోగాలతో బాధపడుతుంటే మరో వైపు జిల్లా అధికారులు వేధింపులు అధికమయ్యాయి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పం దించి ఆశల కనీస వేతనం రూ.26 వేల ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాతో ప్రభుత్వం దిగి రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమౌవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దిప్లానాయక్, జిల్లా కోశాధికారి చంద్రకాంత్, సిఐటియూ జిల్లా నాయకులు తిరుమలయ్య , సత్తయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సాధన, సావిత్రి, అలివేలు, రాజ్యలక్ష్మితో పాటు జిల్లాలోని ఆశవర్కర్లు పాల్గొన్నారు.