Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రాజాపూర్
మండలంలోని గుండేడు గ్రామం నుండి నేరళ్లపల్లి గ్రామపంచాయతీ, వాయిల్ కుంట గ్రామపంచాయతీ, కొర్రతండా గ్రామ పంచాయతీ, రాఘ వాపూర్ గ్రామపంచాయతీ మీదుగా చొక్కంపేట గ్రామపంచాయతీ వరకు సుమారు 9 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతు పనులను గురువారం ఎంపీటీసీ సభ్యుడు, టీఆర్ఎస్ యువనాయకుడు అభిమన్యురెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక దృష్టి సారించి రోడ్డు మరమ్మత్తు కోసం కోటి యాభైలక్షల రూపాయల నిధులను మంజూరు చేయించారని త్వరలోనే పనులు కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్నారు. అప్పటివరకు ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని సొంత ఖర్చులతో మట్టి కొట్టిస్తున్నానని తెలిపారు. ఈ సంధర్భంగా అభిమన్యురెడ్డికి ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ బాలానగర్ మండల ప్రధాన కార్యదర్శి గుండేడ్ చెన్నారెడ్డి,నేరళ్లపల్లి ఎంపిటిసి లింగు నాయక్,నేరళ్లపల్లి సర్పంచ్ ఖలీల్,వాయిల్ కుంటా సర్పం చ్ గుడిబండ గోపినాయక్,సింగిల్ విండో డైరెక్టర్ మంజునాయక్,కొర్ర హాతిరాం నాయక్, వాయిల్ కుంటా ఉపసర్పంచ్ జవహార్ నాయక్,ఎఎంసి డైరెక్టర్, బాలానగర్ బోయశ్రీను,గుడిబండ లక్ష్మణ్ నాయక్,రవి నాయక్, నర్సింహ నాయక్,నేరళ్లపల్లి వార్డ్ మెంబర్ సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు.