Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజ్‌కుమార్
నవతెలంగాణ- మిడ్జిల్
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రాజ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్, జిల్లా అధ్యక్షులు పి.జగన్ పిలుపు నిచ్చా రు. గురువారం మండలంలోని వాడ్యాల గ్రామంలో రాష్ట్ర మహాసభల గోడప త్రికను వారు రైతులతో కలిసి ఆవిష్కరించారు. ఖమ్మం పట్టణంలో ఈనెల 29, 30, 31 తేదీలలో జరుగు మహాసభలకు కేరళ ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారన్నారు. ఈ మహాసభల్లో గత ఐదు సంవత్సరాలు నుండి ఇప్పట్టి వరకు జరిగిన ఉద్యమాలు, పోరాటాలు విజయాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యచరణ రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి నిధులు తగ్గించి కూలీలను పనులకు రాకుండా చేస్తుందని మండిపడ్డారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలి రోజుకు రూ. 600 ఇవ్వాలని పని దినాలు ఒకరికి 200 దినాలు పెంచా లని రాన్నకాలంలో పోరాటాలు నిర్మించాలని ,మహాసభ రూపకల్పన చేయబోతుందన్నారు. 29న లక్ష మందితో భారీ ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ మహాసభల విజయవంతానికి ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు, సన్నా, చిన్నకారు రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ,ఉపాధి సిబ్బంది అధిక సంఖ్యలో తరలిరవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహా య కార్యదర్శి భగవంతు, నాయకులు సాయిలు, జంగయ్య, మహేష్ ,శ్రీనివాసులు, చంద్రయ్య, సాయికుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.