Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి కోల్పోతున్న మత్స్యకార్మికులు
- జిల్లాలోని 13,350 మంది మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండ
- ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం
- కేంద్రం నుండి అందని సహాయం
- నాగర్ ర్నూల్ జిల్లాలో ముగ్గురికి ఆర్థిక సహాయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నా.. వారికి మెరుగైన ఉపాధి కల్పిం చడంలో పూర్తిగా వైఫల్యం చెందిదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అరకొర సౌకర్యా లు కల్పిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదంటున్నారు. మత్స్య కారులకు ఉపాధి అవకాశాలతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని పలు పార్టీలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఒక్కో కార్మికుడికి బీమా ప్రీమియం రూ.72.44 రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రమాదానికి గురైన మత్య్సకారుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం 'ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వైౖ)' పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో 18-70 ఏళ్ల మధ్య వయ స్సున్న మత్య్యకారులను లబ్ధిదారులుగా చేర్చుకుంటారు. మత్స్య పారిశ్రామిక సొసైటీలో సభ్యుడైన మత్స్యకారుడు దురదృష్టవశాత్తు చేపలు పట్టేక్రమంలో లేదా ఏదైనా ప్రమాదంలోమృతి చెందినా ఆ కుటుంబం రోడ్డున పడకుం డా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తోంది.
నాగర్కర్నూల్ జిల్లాలో 210 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా అందులో 13,350 మంది సభ్యులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి వారందరినీ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథ కంలో సభ్యులుగా చేర్చింది. ఈ సంవత్సరం జిల్లాకు చెం దిన ముగ్గురు మత్స్య కార్మికులు ప్రమాదంలో మృతి చెంద గా వారి కుటుంబ సభ్యులకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు నామిని ఖాతాలోకి డబ్బులు జమయ్యాయి.
కేంద్రం సహాయం శూన్యం
మత్స్య కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి ఎటు వంటి సహాయం అందడం లేదు. ముఖ్యంగా నాబార్డ్ ద్వారా రుణాలు ఇస్తే వీరు మరింత ఉపాధి అవకాశాలు పొందుతారు. వాహనాలు, మార్కెటింగ్ వ్యవస్థ సరఫరా చేయాల్సి ఉంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలుకు చెందిన గువ్వల నరసయ్య జనవరి 17న, చిన్న కార్పాములకు చెందిన అనుపటి పరమేష్ జనవరి 17న, నాగర్కర్నూల్ మండ లం వనపట్ల గ్రామానికి చెందిన ఎ.రామకష్ణ ఫిబ్రవరి 14 న చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. దీంతో వారి కుటుంబ సభ్యులైన గువ్వల రేణుక, జె.శివమ్మ, అనుపటి శిరీషల అకౌంట్లో అక్టోబర్ నెలలో బీమా సొమ్ము రూ.5 లక్షలు జమయ్యాయి.
బీమాకు అర్హత
-మత్స్యకారులు, మహిళమత్స్యకారులు, మత్స్య కార్మి కులు, చేపల పెంపకందారులు మరియు మత్స్య సంబం ధిత అనుబంధ కార్యకలాపాలలో ప్రత్యక్షంగా పాల్గొనేవారై ఉండాలి.
- వయస్సు 18 నుండి 70 సంవత్సరాలు ఉండాలి.
ఇలాంటి ప్రమాదాల్లో మృతి చెందితే..
- సముద్రం, రోడ్డు / రైల్వే మొదలైన వాటిలో ప్రమా దాలు బారిన పడితే
- నీటి వనరులలో మునిగిపోవడం/ తప్పిపోవడం.
-అగ్ని/ విషపూరిత పదార్థాల నిర్వహణ కారణంగా ప్రమాదం.
- మెరుపు /విద్యుత్ షాక్ యొక్క స్ట్రోక్.
- మెషినరీతో పని చేస్తున్నప్పుడు ప్రమాదం ,హత్య.
- ఎత్తు నుండి పడిపోవడం వల్ల ప్రమాదం లేదా మరణం, అల్లర్లు.
- పాము / తేలు / జంతువుల కాటుతో మృతి చెందినా లేదా అవయవాలు కోల్పోవడం.
పై ఏదైనా ప్రమాదం జరిగిన తేదీ నుండి 90 రోజుల లోపు ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ సమాచారం, ప్రమాదం జరిగిన తేదీ నుండి 180 రోజుల లోపు కావాల్సిన దృవపత్రాలు బీమా కంపెనీకి ఇవ్వాలి.
జిల్లాలో 13,350 మందికి ప్రయోజనం
జిల్లాలో మత్స్యకారులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో అవకాశం కల్పిం చాం. నాగర్కర్నూల్ జిల్లాలోని మత్స్య పారిశ్రా మిక సహకార సంఘాల్లో సభ్యులుగా 13,350 మందికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించింది. జిల్లాలో ఈ సంవత్సరం ముగ్గురు మత్స్య కారులు ప్రమాదంలో మరణిస్తే ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల బీమా డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీ నామిని అకౌంట్లో జమ చేసింది. నీటి వనరు లు ఉన్న ప్రతి గ్రా మంలో కొత్తగా సంఘాలను ఏర్పాటు చేసి మత్స్యకా రులను సభ్యులుగా చేసి జిల్లాలో మరింత మంది మత్స్యకారులకు అవకాశం కల్పిస్తాం.
- డాక్టర్ బి. లక్ష్మప్ప,
నాగర్కర్నూల్ జిల్లా మత్స్యశాఖాధికారి
ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేశా
నాభర్త గువ్వల నరసయ్య జనవరి 17న చేపల వేటకు వెళ్లి ప్రమాదంలో చనిపోయాడు. నాకు ముగ్గురు అమ్మాయిలే వారి బాగోగులు పెళ్లిళ్లు ఎలా చేయాలో మదన పడుతుంటే సంఘం పెద్దలు, అధికారులు వచ్చి నీభర్త పేరున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేయించిందని రూ.5 లక్షలు వస్తాయని చెప్పి బ్యాంక్ అకౌంట్ తెరిపించారు. నా అకౌంట్లో రూ.5 లక్షలు జమ అయ్యాయి. వాటితో నా ముగ్గురు కూతుర్ల పెళ్లిళ్లు చేశా. ప్రభుత్వం మాలాంటి నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు ఇన్సూరెన్స్ చేయించి ఆదుకోవడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు.
-గువ్వల రేణుక, కల్వకోలు
రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
రాష్ట్ర ప్రభుత్వం నీటి వనరులు ఉన్న ప్రతి గ్రామంలో చేప పిల్లలను వదిలి, మార్కెటింగ్ చేసుకునేలా వాహనాలిచ్చి మత్స్యకారుల కుటుంబాలు ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడుతూనే ఎవరై నా ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో బీమా ప్రీమియం డబ్బులు చెల్లించింది. మా జీవితాలకు తోడ్పాటునందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మా గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో 500 మంది సభ్యులుగా ఉన్నాం అందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాం.
-వాకిటి అంజనేయులు,
మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు, సింగోటం