Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు
మహబూబ్ నగర్: జిల్లాలో చేపట్టిన మన ఊరు మన బడి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఈడబ్ల్యూ ఐడిసి ఇంజనీరింగ్ అధికారులతో ఆయా పాఠశాలల పనులపై సమీక్ష నిర్వహించారు. పనులు పూర్తయిన కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను ప్రారంభానికి సిద్ధం చేయాలని, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టిఎస్ ఈడబ్ల్యు ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామచందర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాము, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.