Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆహార ,ప్రజా పంపిణీ శాఖ సంచాలకులు సంగీత్ సింగ్లా
నవతెలంగాణ -బాలానగర్
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నిర్వహిస్తున్న చౌక ధర దుకాణాల పని తీరు బాగుందని కేంద్ర ప్రభుత్వ ఆహార, ప్రజా పంపిణీ వ్యవస్థ సంచాలకులు సంగీత్ సింగ్లా అన్నారు. గురువారం అయ న జిల్లాలోని బాలానగర్, జడ్చర్ల ,మహబూబ్ నగర్ మండలాల లోని పలు గ్రామాలలో చౌక ధర దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చౌక ధర దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల నిర్వహణ , రిజిస్టర్ల నిర్వహణ, రేషన్ సరుకుల తూకం, నాణ్యతను పరిశీలించారు. ముందుగా ఆయన బాలానగర్ మండలం గుండెడ్ , కేతిరెడ్డిపల్లి గ్రామం లోని చౌకధర దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ కోసం వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదన పు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతా రామారావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ జగదీష్, డిఎస్ఓ బాలరాజు, జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, టూరిజం అధికారి వెంకటేశ్వర్లు ,జడ్చర్ల తహసిల్దార్ లక్ష్మీనారాయణ ,మహబూబ్ నగర్ తాహసిల్దార్ పార్థసారథి తదితరులు ఉన్నారు.