Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కృష్ణ
ఆపదలో ఉన్న నిరుపేదలకు వైద్య, విద్యా అన్నివిధాలుగా సహాయ సహకారాలను అందించడానికే ఈ ట్రస్టు స్థాపిస్తున్నట్లు బీఆర్ఎస్ మండల యువ నాయకులు శివరాజ్ పాటిల్ అన్నారు. మండలంలో సద్గురు క్షిరలింగేశ్వర మఠం ఆవరణంలో శివరాజ్ పాటిల్ అభిమాన సంఘం నాయకులు ఏర్పటుచేసిన బీఆర్ ఎస్ మండల యువ నాయకులు శివరాజ్‌పాటిల్ 43వ జన్మది నోత్సవంలో ఉచితవైద్య, దంతా శిబిరాలను ప్రా రంభించి, కార్యక్రమానికి వచ్చిన పీఠాధిపతుల స్వాములు, ముఖ్యఅతిథులు కేక్‌కట్ చేయించి ఆశీర్వదించారు. పుట్టినరోజూ సందర్భంగా వివిధ క్షేత్రంలో ప్రతిభ కనబరిచిన వి ద్యార్థులకు, శాఖల అధికారులకు సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా కుల మతాల భేదాలు లేకుండా ఆపదలో ఉన్న ప్రతి నిరుపేదలకు సమాజసేవలు గాని వైద్య, విద్య అన్నివిధాలుగా సహాయ సహ కారాలు అందించడానికి దివంగత ఈరన్న గౌడ మాలిపాటిల్ గురజాల సేవా చారిటబుల్ ట్రస్ట్స్థాపిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి వచ్చిన అన్ని గ్రామాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అభిమానులు ఆయనను శాల్వ పూలమాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.