Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లాలో ఐటిఐ చదువు తున్న ఎస్టీ,ఎస్సీ,బీసీ విద్యార్థు లకు ఉపకార వేత్తనాలు మంజూరు చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎం కురుమయ్య డిమాండ్ చేశారు. ఐటిఐ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏ ఓ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఐటిఐ చదువుతున్న విద్యార్థులకు గత రెండు సంవత్సరాలుగా ఉపకార వేతనాలు మంజూరు చేయడం లేదని వారు అన్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉపకార వేతనాలు మీదనే ఆధారపడి చదువుకునే పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణాల్లో రూము లు అద్దెకు తీసుకొని చదువుతున్న వారు అద్దె చెల్లించలేక ఖాళీ చేసి ఊర్లకు వెళుతున్నా రని తెలిపారు . కొంత మంది రోజువారి గా తమ గ్రామాల నుంచి రోజు వారీగా కాలేజీకి వచ్చి పోయే వాళ్ళు బస్ పాస్ చెల్లించ లేక పోతున్నారని తెలిపారు. ఉపకార వేతనాలు వెంటనే మంజూరు చేసి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని కోరారు. వినతి పత్రము సమర్పించిన వారిలో జిల్లా కార్యదర్శి ఎం కురు మయ్య , మహబూబ్ నగర్ పట్టణ కార్యదర్శి ఆది విష్ణు వర్ధన్, అధ్యక్షులు ఎ సత్యం , ఉపాధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు.