Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలానగర్ : దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్ వన్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అన్ని అభివృద్ధి రంగాలలో తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందని అందుకే ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చెందుతూ బిఆర్ఎస్ పార్టీకి ముందడుగు వేశారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గిరిజన తండాకు రక్షితమంచే నీటి సరఫరా పథకాలను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వాందేనని ఆయన అన్నారు. ప్రతి మండల కేంద్రం నుంచి గిరిజన తండాకు బీటీ రోడ్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు .ప్రతి చిన్న గిరిజన తండాకు రక్షిత మంచి నీటి సరఫరా పథకాన్ని ఏర్పాటు చేసి 24 గంటల నీటిని అందిస్తున్నామని ఆయన అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తూ రైతులను రారాజు చేయడానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకొని రైతులకు పెట్టుబడి కోసం రైతుబంధు పథకం రైతు బీమా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ రైతుల వెన్నంట ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఒక్క సెంటు భూమి ఉన్న రైతు చనిపోతే ప్రభుత్వమే భీమా చెల్లిస్తూ ఆ రైతుకు అకాల మరణంతో మరణిస్తే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తూ ఆదుకుంటున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని గుర్తు చేశారు. వృద్ధులకు వితంతువులకు 57 సంవత్సరాల నిండిన ప్రతి వ్యక్తికి ఆసరా పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పలుసమావేశంలో ప్రజలకు తెలియజేశారు. రైతులు సమావేశాలు ఏర్పాటు చేయడానికి రైతు వేదిక భవనాలను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి అన్ని మండల కేంద్రాలలో ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు.