Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ పెబ్బేరు
దోమల నివారణ కోసం మురుగు కాలువలపై పిచికారి చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ ఎద్దుల కరుణ శ్రీ సాయి తెలిపారు. శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ,సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశానుసారం పెబ్బేరు మున్సిపల్ పరిధిలోని 4 వ,5 వ,6వ వార్డులలో దోమల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో వాటి అభివృద్ధి జరగకుండా యాంటీలార్వా ద్రావణాన్ని పిచికారీ చేసినట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ 5 వ వార్డ్ కౌన్సిలర్ గోపిబాబు,6 వ వార్డ్ కౌన్సిలర్ రామకృష్ణ,మేనేజర్ గణేష్ బాబు,శానిటరి , ఉమ మహేశ్వర్ రెడ్డి,కాలనీ పెద్దలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.