Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - కొత్తకోట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో వాల్మీకిబోయల చిరకాల డిమాండ్ ఎస్టీ జాబితా బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన శుభ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గం వాల్మీకి బోయలు శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్టీ బిల్లుకు మద్దతుగా నిలిచి బిల్లు పాస్ చేయుటకు కృషి చేసిన ఎమ్మెల్యేను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కలిసిన నియోజకవర్గ వాల్మీకిబోయల ప్రజాప్రతినిధులు,నాయకులు ఎంపీపీ కొండలు, ఎంపీటీసీ గులాబీ గోవిందు,వేంకటరమణ, పోన్నకల్ కృష్ణ, సర్పంచులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, కావలి రాజు,పంతులు సత్యన్న , బోగిని చంద్రశేఖర్, శ్రీనివాసులు, భాస్కర్ నాయుడు, నాయకులు నాగరాజు,దాసర్పల్లి రాజు,శాఖ పురం రాజు,రాచాల శ్రీనివాసులు, శివ, అంజన్న, సహదేవుడు, రామాంజనేయులు,రమేష్,.వడ్డేమాన్ మహేందర్, రాములు పాల్గొన్నారు.
పెబ్బేరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుటకు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపగా అది కేంద్రానికి అందలేదు అనడంతో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి బోయల న్యాయమైన కోరికను నెరవేర్చే దిశగా మరోమారు శుక్రవారం సీఎం కేసీఆర్ వాల్మీకి బోయలతో పాటు, దాని ఉప కులాలను ఎస్టీ జాబితాలో చేర్చుటకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నట్లు వాల్మీకి నాయకులు తెలిపారు.దీనికి ఉద్యమపంథా ఎత్తుకున్న వాల్మీకి బోయలు సంతోషం వ్యక్తం చేస్తూ శనివారం పెబ్బేరు సుభాష్ చొరస్తాలో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కి పెబ్బేరు మండల వాల్మీకి ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు హరిశంకర్ నాయుడు, మునీశ్వర్ నాయుడు, బలరాం,వీరస్వామి, వెంకటయ్య, కుమారస్వామి నాయుడు, గోవర్ధన్, కృష్ణ, మూర్తి, తిరుపతి, శివ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.