Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- కొత్తకోట
కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రం లో ఇండోర్ స్టేడియం ను మంజూరు చేయాలని క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ ను శనివారం హైదరాబాద్ లోని ఆయన ఛాంబర్ లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అతి పెద్ద మున్సిపాలిటీ కొత్తకోట అని విద్య వ్యవస్థ ఎక్కువగా ఉందని మంత్రికి వివరించారు. క్రీడాకారులు కూడా ఎక్కువగా ఉన్నారని కొత్తకోటలో స్టేడియం లేక ప్రైవేట్ స్థలంలో క్రీడలు కొనసాగుతున్నాయని అందుకే కొత్తకోట మున్సిపాలిటీ లో ఇండోర్ స్టేడియం అవసరం ఉందని మంత్రికి తెలిపారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ త్వరలోనే స్థల పరిశీలన చేసి మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే ఆల తెలిపారు..