Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్ నగర్ : తండాలను గ్రామపంచాయతీలుగా చేసి వేలాది మందిని సర్పంచులుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా పద్మావతి కాలనీ, అయ్యప్ప కొండ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవాలాల్ మహారాజ్ గుడిలో బంజారా సంప్రదాయం ప్రకారం మహా భోగ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో సేవాలాల్ దేవాలయ కమిటి చైర్మన్ చంద్రా నాయక్, ప్రధాన కార్యదర్శి దేవుజా నాయక్, కోశాధకారి గోపాల్ నాయక్, గిరిజన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు నాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ నాయక్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, గ్రూప్- 1 అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ గౌడ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఛత్రు నాయక్, డిఎస్డిఓ పాండు, కౌన్సిలర్లు మోతీలాల్, లక్ష్మణ్ నాయక్, నాయకులు అంతీరాం నాయక్, డా. శేఖర్, దేవుజా నాయక్, దశరథ్ నాయక్, గంగారాం నాయక్, తానాజీ, హరి చందర్ నాయక్, ఆనంద్ నాయక్, రాములు నాయక్, గోవర్ధన్ నాయక్, రంగ, రవి రాథోడ్, రామ కృష్ణ, గిరిజన ఉద్యోగులు సంఘాల నాయకులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా గిరిజనులకు జిల్లా కలెక్టర్ సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కొండ పై ఉన్న సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయం వద్ద సంత్ సేవాలాల్ 284 జయంతి వేడుకలను నిర్వహించారు.కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, ఉద్యోగుల కార్యదర్శి చంద్రనాయక్,ఉపకార్యనిర్వహక సమాచార ఇంజనీర్ ఇస్రనాయక్, తదితరులు హాజరయ్యారు.
మహమ్మదాబాద్: బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలను బుధవారం చౌదర్పల్లి పెద్దతండలో గ్రామ సర్పంచ్, తాండ వాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాట్రవత్ శ్రీదేవి,ఎంపీటీసీ సోనీ బాయి, దేవాలయ ఫౌండర్ దేవిజానాయక్, పాల్గున, రాములు, యువకులు రవి, లోకేష్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.
రాజాపూర్ : సేవలాల్ మహారాజ్ గారి 284వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాజాపూర్ మండల కేంద్రల్లో ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ,డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి,జీసీసీ చైర్మన్ వాల్యా నాయక్ ఎంపీపీ సుశీల రమేష్ నాయక్, జడ్పిటీసీ ి షన్ మోహన్ నాయక్, సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షులు సభ శ్రీనివాస్ నాయక్ హజరైయ్యారు.
జడ్చర్ల : సంతు సేవాలాల్ 284వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.బాదేపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి గిరిజన సంఘం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. శంకరయ్య పల్లి తాండ సమీపంలోని బొంగరాల గుట్ట దగ్గర నిర్మించిన సంతు సేవాలాల్ ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య,సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు వడిత్య రమేష్ నాయక్,శంకర్ నాయక్,లోకేష్ నాయక్,గోపాల్ నాయక్,కౌన్సెలర్ చైతన్య చౌహన్, కోట్ల ప్రశాంత్ రెడ్డి,సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణిల్ చందర్,పిట్టల మురళి,సర్పంచ్ లు గాంగ్య నాయక్, రాములు నాయక్,దీపక్ రాథోడ్, రవి నాయక్,ఉప సర్పంచ్ పాండునాయక్, పాల్గొన్నారు.
బాలానగర్ : జాతీయ రహదారి పక్కన పెద్దాయపల్లి చౌరస్తా వద్ద సేవాలాల్ జయంతి వేడుకల్లో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పూజా చేశారు.
రాజాపూర్ : రాజాపూర్ మండలం కొర్ర తండా గ్రామ పంచాయ తీలోని సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం తండా ప్రజలు మా వేషధారణ అకట్టుకుంది.కార్యక్రమంలో యువనాయ కులు, ఉద్యోగస్తులు,వార్డు సభ్యులు పాల్గొన్నారు.