Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్ నగర్ : గ్రూప్ పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించాలన్న కృషిి, పట్టుదలతో చదివి మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ జి .రవి నాయక్ అన్నారు.బుధవారం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో గ్రూప్ 2,3,4అభ్యర్థుల కు ఉద్దేశించి ఏర్పాటుచేసిన 3 నెలల స్పెషల్ ఫౌండేషన్ కోర్స్ ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు .రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎస్సీ ,ఎస్టీ, బీసీ ,మైనార్టీ శాఖల ద్వారా పేద అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2015 నుండి ఇప్పటి వరకు వివిధ రకాల ఉచిత కోచింగ్ శిక్షణ ఇచ్చి నట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కోచింగ్ కేంద్రాలకు పేద, మధ్య తరగతి విద్యార్థులు మాత్రమే వస్తారని, అయినప్పటికీ ప్రైవేటు కోచింగ్ సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ కోచింగ్ కేంద్రాలు ఎంతో నాణ్యతతో ,మెరుగైన ఫ్యాకల్టీతో నిర్వహించా మని తెలిపారు.దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తరగతి లో బోధిస్తున్న అంశాలపై అభ్యర్థులు ఎక్కువగా దృష్టి సారించాలని ,వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో వారి భవిష్యత్తును వారే తీర్చిదిద్దుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారులు, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ తదితరులు హాజరయ్యారు.