Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
రాహుల్ గాంధీ పాద యాత్ర అనంతరం కాంగ్రెస్ సిద్ధాం తాలను ప్రజల్లోకి తీసు కెళ్లాలని గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర ముగిసిన సందర్భంగా జోడోయాత్ర సందేశం కాంగ్రెస్ సిద్ధాంతాలను తీసుకుపోవాలని ఉద్దేశంతో గద్వాల్ నియోజకవర్గంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం 15 ఫిబ్రవరి గట్టు మండలంలో ఉదయం లింగాపురం, చిన్నోనిపల్లి, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు గద్వాల నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో యాత్ర మూడవరోజు కొనసా గుతుందన్నారు.కార్యక్రమంలో పీసీసీ ప్రతినిధి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌస్, జిల్లా సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమల్, గట్టు మండల అధ్యక్షులు రవి నాయుడు, గద్వాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర, అలెగ్జాండర్, మైనుద్దీన్, అంబేద్కర్, శ్రీకాంత్,లింగాపురం, చిన్నోనిపల్లి నాయకులు పాల్గొన్నారు.