Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - మహబూబ్ నగర్
అఖిలభారత శాంతి సంఘం ప్రతినిధులు బుధవారం రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జ్ఞాపికను అందించారు.జిల్లా అధ్యక్షులు కె లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్ఎం ఖలీల్, బలాలుద్దీన్, మహమ్మద్ అజీజ్ ఎన్ఆర్ఐ తదితరులు కలిశారు. ఈ నెల 5 తేదీన మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రపంచ శాంతి, జాతీయ సమైక్యత, రాజ్యాంగ స్ఫూర్తి,తదితర అంశాలపై కవి సమ్మేళనం నిర్వహించామని తెలిపారు. అనేకమంది కవులు పాల్గొన్న ఈ సమావేశ స్ఫూర్తిగా ప్రపంచ శాంతికి సంఘీభావం ప్రకటించారని వారు తెలిపారు. మతోన్మాదాన్ని, మతమౌడ్యాన్ని, ఉగ్రవాదాన్ని, సామ్రాజ్యవాదాన్ని ఎండబడుతూ ప్రపంచ శాంతికై అఖిలభారత శాంతి సంఘీభావ సంఘము కృషి చేస్తుందని వారు తెలిపారు. ఉన్నతమైన లక్ష్యాలతో ప్రపంచశాంతికి కృషి చేస్తున్న అఖిలభారత శాంతి సంఘీభావ సంఘానికి తమ సంఘీభావం ఉంటుందని మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శాంతి సంఘీభావ సంఘం బాధ్యులను అభినందించారు.