Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మిడ్జిల్
గ్రామీణ ప్రాంతాలలో గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి, సీఐటీయూ జిల్లా సహా కార్యదర్శి తెలుగు సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నుంచి ఐదు నెలల పాటు జీతాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. సాధారణ కార్మికులైన గ్రామపంచాయతీలో పనిచేస్తున్న నిరుపేదలైన దళిత గిరిజన, వెనుకబడిన తరగతుల వారే పనిచేస్తున్నారని. తెలిపారు. అలాంటి కార్మికులకు నెలల తరబడి జీతాలు రాకుంటే ఎలా బతుకు తారని, అప్పులు చేసి ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇచ్చే జీతాలు అతి తక్కువ 8500 కూడా అందరికీ సమానంగా ఇవ్వడం లేదని, పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు తమ ఇష్టానుసారంగా జీతాలు తక్కువగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 20న దేవరకద్ర ఎమ్మెల్యే స్వగ్రామమైన అన్న సాగర్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తహసీల్దార్ రాజీవ్ రెడ్డిక,ి ఎంపీడీవో సాయి లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్లు యాదయ్య ,వెంకటయ్య, బాలస్వామి మంగమ్మ వెంకటమ్మ, అచ్చలయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.