Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హన్వాడ
ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు లేక పేద విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని నాణ్యమైన విద్యను అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీఎస్ యూటీిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ కిష్టయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలో నీ ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా పర్యటించారు. కొత్తపేట కంకర లోని వివిధ ఉన్నత పాఠశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి పాపన్న గారి మాణిక్ రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీడీఈవోలు ఎంఈఓ లు పూర్తిస్థాయిలో లేక విద్యా వ్యవస్థ బ్రష్టు పట్టిందనిన్నారు. ఎంఈఓ లను పూర్తిస్థాయిలో నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల యూటీఎఫ్ అభ్యర్థి పాపన్న గారి మాణిక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో ఆయనతోపాటు టిఎస్ యూటిఎఫ్ మండల కమిటీ అధ్యక్షులు కే కిష్టయ్య నాయక్ ,మండల సీనియర్ నాయకులు సంపత్ కుమార్ ,ఉపాధ్యక్షులు రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.