Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తకోట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్ర మంలో భాగంగా నాటిన మొక్కలను నరి కిన రియల్ ఎస్టేట్ వ్యాపారు లపై కఠిన చర్యలు తీసుకో వా లని గ్రామ అధ్యక్షుడు కోటేశ్వర రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో రోడ్డుకు ఇరువైపుల గతంలో నాటిన హరితహారం మొక్కలను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపా రులు నరికివేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ మాట్లా డారు.ఏపుగా పెరిగిన హరితహారం చెట్లను నరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వేసవి కాలంలో పశు పక్షా దులు, మను షులు చెట్ల నీడను ఆశ్రయించి ఎండవేడి నుంచి ఉపశమనం పొందుతారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.