Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల పరిషత్ అధ్యక్షులు బంగారు శ్రీనివాసులు
ఆత్మకూరు : విద్యుత్, నీటి సమస్యలు పరిష్కరించాలని మండల పరిషత్ అధ్యక్షులు బంగారు శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశపు హాల్లో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావే శానికి మండల పరిషత్ అధ్యక్షుడు అధ్యక్షత వహిం చారు. అనంతరం వివిధ శాఖలకు సంబంధించి సమీక్ష సమావేశం జరిగింది. మొదట విద్యుత్ శాఖ పై సమస్యలు బాలకృష్ణాపూర్ సర్పంచ్ తుకారం నాయ క్, కతేపల్లి సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి కరెంటు సక్ర మంగా ఇవ్వడం లేదని కోతలు విధిస్తారని ప్రస్తా వించారు .ఈ సందర్భంగా కరెంటు ఏఈ నరసింహ మాట్లాడుతూ నేను ఇప్పుడే కొత్తగా వచ్చానని అయితే సిబ్బంది కొరత ఉన్నదరిచ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మిషన్ భగీరథ నీటి విషయంలో ఎంపీటీసీ అనసూయమ్మ మాట్లాడుతూ మిషన్ భóగీరథ నీరు రావడంలేదని, కట్టెపల్లి సర్పంచ్ అసలే మా గ్రామంలోకి భగీరథ నీళ్లు గత కొంతకాలం రావడంలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు పంపింగ్ మోటర్లు నీరు తోడే ప్రాంతంలో నీటితో పాటు బురద రావ డంతో మోటర్లు కాలిపోతున్నాయని తెలిపారు. త్వర లోనే సమస్యను పరిష్కరించి నిరంతరం నీటి సరఫ రాకు కృషి చేస్తామని తెలిపారు.వైద్యశాలలు ప్రసూతి సంఖ్య పెంచాలని కోరారు. అనంతరం ఎక్సైజ్ శాఖపై సమక్ష నిర్వహిస్తుండగా అంతలోనే ఎంపీడీవో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృశ్య మిగతా శాఖల సమీక్ష సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కోటీశ్వర్, జెడ్పీటీసీ శివరంజని, తాహసీల్దార్ సింధుజ, ఎంపీడీవో వెంకటేశ్వర్లు ,సిం గల్ విండో చైర్మన్ గాడి కృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.