Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తకోట : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో యువకులు రాణించాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ యాదగిరి అన్నారు.శుక్రవారంకొత్తకోటలో సత్యశోధకు సమాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో సూక్ష్మ,చిన్న , మధ్యతరహా పరిశ్రమల వ్యవస్థాపక అవగాహన కార్యక్ర మం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఫీల్డ్ మేనేజర్ సురేష్, హర్టీకల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శంకర్ స్వామి, నేషనల్ గ్రీన్ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్ ఐ.సుదర్శన్ రావు, క్రమశక్తి అవార్డు గ్రహీత ఎస్. ఆర్. ప్రేమయ్యలు హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి మోజర్ల కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు.