Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నంగునూరు: బైక్ అదుపుతప్పి గుంతలో పడడంతో యువకుడు అక్కడికక్కడే మతి చెందిన సంఘటన బుధవారం రాత్రి పాలమాకుల శివారులో చోటు చేసుకుంది. రాజగోపాల్‌పేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అప్పలాయిచెర్వు గ్రామానికి చెందిన నాయిని మహిపాల్‌రెడ్డి ( 25 ) బుధవారం రాత్రి తన అత్తగారి ఊరు ఇల్లంతకుంట మండలం ఎల్జీపూర్ గ్రామం నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో పాలమాకుల శివారులోకి రాగానే బైక్ అదుపు తప్పి జేసీబీ గుంతలోకి దూసుకెళ్లి పక్కనే ఉన్న రాతి కడ్డీపై పడింది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా మహిపాల్‌రెడ్డికి రెండు సంవత్సరాల కిందట లాస్యతో వివాహం జరిగింది. మృతుని తండ్రి నాయిని కాంతారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహిపాలౌడ్డి తెలిపారు.