Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్) :విధులు నిర్వహిస్తూ కూర్చున్న కుర్చీలోనే సెక్యూరిటీ గార్డు మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ గ్రామ శివారులోని సదరన్ ఎక్స్పాండెడ్ పాలిస్ట్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రం ఫైజాబాద్ జిల్లా రాంపూర్ బైహరి గ్రామానికి చెందిన గణేష్ సింగ్ (48) నాలుగు నెలలుగా పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రోజూలాగే గురువారం ఉదయం 7.50 గంటల ప్రాంతంలో పరిశ్రమ గేటు వద్ద కుర్చీలో కూర్చుని విధులు నిర్వహిస్తున్నాడు. అకస్మాత్తుగా కుర్చీలో నుండి కిందపడి పోవడంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ సూపర్వైజర్ ధర్మేంద్రయాదవ్, ప్రొడక్షన్ మేనేజర్ నీరజ్రారులు వెంటనే గణేష్ సింగ్ను మేడ్చల్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించే సరికే మృతి చెందాడు. జనరల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు మనోహరాబాద్ ఎస్ఐ రాజుగౌడ్ తెలిపారు.