Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గజ్వేల్
రోజురోజుకూ కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీగా గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. గురువారం గజ్వేల్ అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనా విస్తృత ంగా ఉన్న జిల్లాకు ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించాలని, మండలానికి రెండు చొప్పున 108, 104 అంబులెన్సులో అందుబాటులో ఉంచాలని అన్నారు. వద్దాశ్రమాలకు కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ , బెడ్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని తెలిపారు. కరోనా బారిన పడిన వారు ఐసోలేట్ ఆయ్యేందుకు మండల, జిల్లా కేంద్రాల్లో ఫంక్షన్ హాళ్లు, రైతు వేదికలను ఐసోలేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, నాయకులు చంద్రం తదితరులు పాల్గొన్నారు.