Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐలు శ్రీధర్, సార శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించ డంతో పాటు భౌతిక దూరం పాటించాలని హు స్నాబాద్ ఎస్సై శ్రీధర్ సూచించారు. గురువారం పట్టణంలోని బస్టాండ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ల్లో డ్రైవర్లకు, రైతులకు, ప్రయాణికులకు కరోనా జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరి మానా విధిస్తామని హెచ్చరించారు.
కొల్చారం: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కషి చేయాలని కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం కొల్చారంలోని మెదక్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రజలకు విస్తతంగా అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా, విస్తతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సాయిలు, మల్లేశం, సహకార సంఘం చైర్మన్ మనోహర్, మాజీ సర్పంచ్ కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.