Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతుల ఆందోళన
నవతెలంగాణ-వెల్దుర్తి
కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాల్లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రానికి వస్తున్న ధాన్యానికి సరిపడా లారీలు రాక అవసరమైన గోనె సంచులు లేక కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. దీంతో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం రాసులు నీటిపాలవుతున్నాయి. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు గురువారం కొనుగోలు కేంద్రాల వద్ద ఆందోళన చేపట్టారు. వెంటనే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని కొనుగోళ్లు వేగ వంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిం చకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు లారీలను త్వరగా పంపి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో మల్లయ్య జగ్గ లింగం, కంచర్ల లింగం, కంచర్ల మల్లేష్, సల్ల మహేష్, సల్ల యాదగిరి , నాగులు, పోచయ్య, కేతమ్మ, నరసమ్మ, యాదమ్మతో పాటు పలువురు రైతులున్నారు.
గన్నీ సంచుల కోసం బారులు
బెజ్జంకి : మండల కేంద్రంలోని స్థానిక పీఏసీఎస్ గోదాం వద్ద గురువారం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులకు గన్నీ సంచులు పంపిణీ చేయడంతో రైతులు బారులు తీరారారు. మూడు రోజులుగా గన్నీ సంచుల కొరతతో కొను గోలు కేంద్రాల్లో ధాన్యం తూకం ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇబ్బ ందులు ఎదుర్కొంటున్న రైతులు గన్నీ సంచులు అందుబాటులోకి రావడంతో ఉదయం నుంచే పడిగాపులు కాశారు. అకాల వర్షాలు కురిసే అవకాశాలుండ డంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం నిర్వాహకులు చొరవ చూపాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ సీఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లక్షా 10 వేల నూతన గన్నీ సంచులు వచ్చినట్లు తెలిపారు.