Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-దుబ్బాక మండలం తిమ్మాపూర్లో గుండెపోటుతో మహిళ..
నవతెలంగాణ-మద్దూరు
వేర్వేరు ప్రాంతాల్లో కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన మద్దూర్, దుబ్బాక మండలాల్లో గురువారం చోటు చేసుకుంది. దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన రావుల వీరస్వామి(57) కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతూ సిది ్దపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నా డు. పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య, నలుగురు కుమారులున్నారు.
దుబ్బాక రూరల్: దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి గురువారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మతి చెందా డు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిట్టాపూర్ గ్రామానికి చెందిన సోలిపేట రామి రెడ్డి (65) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిం చేవాడు. 20 రోజులుగా కరోనా వ్యాధితో బాధ పడుతున్నాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు ఆయనను హైద్రాబాద్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి గురువారం మతి చెందాడు. మతుడికి భార్య, కొడుకు, కూతురున్నారు. ఈ మధ్య కాలంలోనే వీరి కుటుంబం హైదరాబాద్లో స్థిరపడినట్లు సమాచారం. మతుడు మావోయిస్టు అగ్రనేత దివంగత సోలిపేట కొండల్ రెడ్డి పెద్దన్నయ్య కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గుండెపోటుతో మహిళ....
గుండె పోటుతో మహిళ మతి చెందిన ఘటన దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గన్నేబోయిన మల్లా గౌడ్ భార్య లక్ష్మీ (60) ఛాతీలో నొప్పిగా ఉందని కుటుంబీకులకు తెలపడంతో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తిమ్మాపూర్ పీహెచ్సీ సమీప ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు ధృవీకరించారు. మతురాలికి భర్త గన్నెబోయిన మల్లాగౌడ్, కుమారుడున్నారు. వీరి కుటుం బాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.