Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 ఏండ్లు దాటిన వారందరికీ టీకా వేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య
నవతెలంగాణ-గజ్వేల్
గజ్వేల్ నియోజకవర్గంలోని కోవి డ్ నిర్దారణ పరీక్షల సంఖ్య పెంచా లని, 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సంద బోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమా ండ్ చేశారు. ఈ సందర్భంగా గురు వారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోజూ వందల మందిక ిపైగా పరీక్షల కోసం వస్తుంటే సరి పడా టెస్ట్ కిట్లు లేవని 30 మందికి మాత్రమే టెస్టులు చేసి పంపిస్తున్నా రని అన్నారు. ఆపద కాలంలో ప్రజల ను కాపాడాల్సిన ప్రభుత్వం వీరిని వెనక్కి పంపడంతో పాజిటివో, నెగిటివ్ తెలియక జనంలో కలుస్తు న్నారని, ఫలితంగా కరోనా మరింత వ్యాపిస్తోందని తెలిపారు. ఇప్పటికైనా పీహెచ్‌సీకి టెస్టుల కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలని కోరారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత సమస్య నూ పరిష్కరించాలని అన్నారు. 45 ఏండ్లు నిండిన వారూ కోవిడ్ సెకండ్ డోస్ వ్యాక్సిన్్కు ఆన్లైన్లో రిజిస్ట్రేష న్ చేసుకోవాలని చెప్పడం సరికాద న్నారు. ఆ నిబంధనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పేదలందరికీ చదువు రాదని, ఆన్లైన్లో రిజిస్ట్రే షన్ చేసుకునేంత పరిజ్ఞానం, సార్మ్ ఫోన్లు వినియోగం లేవని తెలిపారు. కోవిడ్ బారిన పడ్డ వారు ఐసోలేషన్ చేసేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న పాఠశాలలు, రైతు వేదికలు, కమ్యూ నిటీ హాల్స్‌ను ఐసోలేషన్ కేంద్రా లుగా ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజనాన్ని అంగన్వాడీల సహకారం తో ఏర్పాటు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విపత్కర సమయంలో ప్రతి కుటుం బానికి నెలకు రూ. 7500, ప్రతి వ్యక్తి 10 కిలోల బియ్యం ఉచితంగా అందజేయాలని కోరారు.