Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాలు పేరుతో బస్తాకు కిలో చొప్పున తరుగు
- రైస్‌మిల్ ఎదుట రైతుల ఆందోళన
నవతెలంగాణ-చేర్యాల
ధాన్యం కొనుగోలులో మిల్లర్లు మాయాజాలం సృష్టి స్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో తాలు ఉందనే పేరుతో బస్తాకు కిలో చొప్పున తరుగు తీస్తు న్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు గురువారం రైస్‌మిల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన ముస్త్యాల గ్రామంలోని సాంబ శివ రైస్‌మిల్ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివ రాలిలా ఉన్నాయి. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని స్థాని క వ్యవసాయ మార్కెట్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ రైతులు విక్ర యించిన ధాన్యాన్ని మూడు రోజులుగా ముస్త్యాల గ్రామ ంలో ఉన్న సాంబ శివ రైస్ మిల్కు పంపుతున్నారు. రైస్ మిల్లు యజమానులు ధాన్యాన్ని దించుకునే సమయంలో ధాన్యంలో తాలు పేరుతో బస్తాకు కిలో చొప్పున తరుగు తీస్తూ తూకం వేస్తున్నారు. ఇలా మూడు రోజులుగా ఈ రైస్‌మిల్‌కు 27 మంది రైతుల నుండి కొనుగోలు చేసిన దాదాపు 1103 క్వింటాళ్ల ధాన్యంలో 16 క్వింటాళ్ల తరుగు చూపి కొనుగోలు చేయడంపై రైతులు మిల్లర్లను నిలదీశారు. దీంతో మిల్లర్లు ఇష్టం ఉంటే ధాన్యం పంపండి లేకుంటే లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను మిల్లర్లు తాలు పేరుతో దోచుకోవడం దారుణమని, గతంలోనూ ఈ రైస్ మిల్లులో ఇలాంటి ఘటనలు చోటుచేకున్నాయని రైతులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పీఏసీఎస్ డైరెక్టర్లు వెలుగల శ్రీనివాస్, ఉడుముల బాల్ రెడ్డి, రైతులు, శ్రీరాములు, ప్రసాద్, బాలకృష్ణ, అనిల్ పాల్గొన్నారు.