Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రసమయి బాలకీషన్
- లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులందజేత
- ముస్లీం సోదరులకు రంజాన్ కానుకగా దుస్తులు పంపిణీ నవతెలంగాణ-బెజ్జంకి
పేదల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే రసమయి బాలకీషన్ అన్నా రు. గురువారం మండల కేంద్రంలో ని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కల్యాణలక్ష్మి లబ్దిదారులకు, సీఎంఆర్ ఎఫ్ బాధితులకు చెక్కులను అందజే శారు. అనంతరం ముస్లీం సోదరుల కు రంజాన్ కానుకగా దుస్తులను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా విజృం భణ దృష్ట్యా మండలంలోని ప్రజలం దరూ స్వీయ నియంత్రణ పాటించా లని సూచించారు. కరోనా బారిన పడిన వారు అపోహలకు గురవ్వకుం డా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స ద్వినియోగం చేసుకోవాలని తెలిపా రు. అదే విధంగా కరోనా కట్టడికి కో విడ్ వ్యాక్సిన్ను వినియోగించుకోవా లని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కనగండ్ల కవిత, తహసీల్దార్ విజరు ప్రకాశ్ రావు, ఎంపీడీవో రాఘవేందర్ రెడ్డి, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు పాకాల మహిపాల్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్దిదారులు, ముస్లీం సోదరులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని టీఏవైఎస్ వినతి
కరోనా బారిన పడ్డ పేదలు మె రుగైన వైద్యం పొందేందుకు ప్రభుత్వ ం కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని అంబేద్కర్ యువజన సంఘం మండ లాధ్యక్షుడు వడ్లూరీ పర్శరాం ఆధ్వర్య ంలో ఎమ్మెల్యే రసమయి బాలకీషన్కు వినతిపత్రం అందజేశారు.