Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజయ్య
- మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ఏపీఎం మగ్దూం అలీతో కలిసి పరిశీలన
- రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సూచన
నవతెలంగాణ-తొగుట
రైతులు ప్రభుత్వ సూచనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజయ్య సూచించారు. గురువారం మండ లంలోని తుక్కాపూర్, చందాపూర్, జప్తి లింగారెడ్డిపల్లి, లింగా పూర్, బంజేరు పల్లి, వెంకటరావుపేట గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ఏపీఎం మగ్దూం అలీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పుస్తక నిర్వహణపై అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చే ముందు ఆరబెట్టుకొని, తాలు, పొల్లు లేకుండా, తూర్పార బట్టి తీసుకు రావాలని కోరారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం తూకం పూర్తి కాగానే రైతులు పట్టాదారు పాసు బుక్కు, ఆధార్ , బ్యాంక్ పాసుబుక్ జీరాక్స్ పత్రాలను ఐకేపీ సిబ్బందికి అందిస్తే 24 గంటల్లో వారి ఖాతాలోకి డబ్బులు జమ చేస్తారని తెలిపారు. అదే విధంగా ఐకేపీ సిబ్బంది రైతులకు ఎలాం
టి ఇబ్బందులు కలుగకుండా చూడాని, తూకం వేసిన రైతుల వివరాలను వెంట వెంటనే ట్యాబ్లో ఎంట్రీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఐకేపీ సిబ్బంది, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.