Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు
ప్రతాప్ రెడ్డి
- 7,8 వార్డుల్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి నవతెలంగాణ-గజ్వేల్
అన్ని రంగాల్లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గురు వారం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని 07, 08వ వార్డ్‌లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచి కారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కరోనా విజృంభణ నేపథ్యంలో గురువారం నుండి ప్రతి వార్డులో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా కరోనా కట్టడికి ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలని కోరారు. అత్యవసర పరిస్థితి లో మాత్రమే బయటకు రావాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కరోనా బాధితుల ను గుర్తించేందుకు ప్రతి గ్రామం లో ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, మున్సిపాలిటీలలో ఏఎన్ఎం, ఆశావర్కర్, శానిటేషన్ ఇన్స్పె క్టర్ ఇంటింటి సర్వే చేపట్టే వారి బాగోగులు తెలుసుకుంటారని, ఆరోగ్యం బాగా లేకపోయిన వారికి ప్రాథమికంగా మెడికల్ కిట్ అందజేస్తారని తెలిపారు. కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే 108లో ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కాలేజీలకు పంపించే ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ రాజమౌళి, వైస్ చైర్మెన్ జక్కి యోద్దీన్, కౌన్సిలర్స్ కూరకుల శ్రీనివాస్, రహీం, టీఆర్ఎస్ నాయకులు గంగిశెట్టి రవీందర్, మామిడి శ్రీధర్, నవాజ్ మీర, హనుమంత్ రెడ్డి, అహ్మద్, స్వామి చారి,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
అండర్ డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలి
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను వేగంగా పూర్తి చేయాలని ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సూచించారు. గురువారం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద జరుగుతున్న పనులను ఆయన పరిశీలిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని పనుల ను సంబంధిత కాంట్రాక్టర్ శరవేగంగా పను లు పూర్తి చేయాలని అన్నారు. అదే విధంగా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ నేతి చిన్న రాజమౌళి, వైస్ చైర్మన్ జకీర్, నాయకులు రవీందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, హనుమంత రెడ్డి, హైమద్ తదితరులున్నారు