Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామపంచాయతీ పాలక వర్గాల తీర్మానం
- ఆంక్షలు ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా
నవతెలంగాణ-మర్కుక్
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో పలు గ్రామాల్లో గ్రామ పంచా యతీ పాలకవర్గాలు పాక్షిక లాక్డౌన్కు తీర్మానం చేస్తున్నాయి. ఇందులో భాగంగా నే మర్కుక్ మండలంలోని సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో, మర్కుక్ గ్రామంలో గురువారం నుండి పదిహేను రోజులు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ భాగ్య భిక్షపతి , మర్కుక్ గ్రామ సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ గ్రామం లోని అన్ని షాపులు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకూ, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకూ మాత్రమే తెరవాలని సూచించారు. ఈ స్వచ్ఛంద లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించాల ని కోరారు. ఎవరైనా కిరాణా షాపు యజ మానులు పైనతెలిపిన నిబంధనలు ఉల్లం ఘిస్తే రూ. 500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్) :మనోహరాబాద్ మండలంలోని కోనాయి పల్లి (పీటి) గ్రామపంచాయితీ పాలక వర్గ సమావేశాన్ని గురువారం సర్పంచ్ బాష బోయిన ప్రభావతి అధ్యక్షతన కార్యదర్శి నవీన్ నిర్వహించారు. ఈ సందర్బంగా కరో నా నియంత్రణకు గ్రామంలో పాక్షిక లాక్ డౌన్ విధిస్తున్నట్లు తీర్మానించారు. అనంత రం సర్పంచ్ బాషబోయిన ప్రభావతి మా ట్లాడుతూ గ్రామంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకూ, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకూ మాత్రమే దుకాణాలను తెరవాలని, నిబందనలకు విరుద్ధంగా దుకాణాలు తెరి చిన వారిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలి పారు. అలాగే కరోనా కట్టడికి పంచాయ తీలో పనిచేస్తున్న ఫ్రంట్లైన్ వర్కర్లు (పారిశుద్య కార్మికులకు) సేఫ్టి కిట్లను అందజేయడానికి తీర్మానాలు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయితీ పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు.
మండలంలోని చెట్లగౌరారంలో సర్పం చ్ నర్సయ్య అధ్యక్షతన గ్రామ సభ నిర్వహి ంచి పాక్షిక లాక్డౌన్ నిర్వహిస్తున్నట్లు తీర్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకూ, సాయంత్రం 6 నుండి 9 గంటల వరకూ మాత్రమే దుకా ణాలను తెరవాలని, గ్రామంలో ఎవరైనా మాస్కులేకుండా తిరిగితే వారికి రూ. 500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.అ దే విధంగా గ్రామంలో అవసరమైన మురు గు కాల్వల నిర్మాణం, సీసీ రోడ్డు నిర్మాణా లపై గ్రామసభలో తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీహరిగౌడ్, కార్యదర్శి సంతోష్ కుమార్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.