Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నాయకుడు విజయపాల్‌రెడ్డి
నవతెలంగాణ- హుస్నాబాద్
హుస్నాబాద్ ను అభివృద్ధి చేస్తామంటే ప్రతిపక్షాలే అడ్డుకుంటున్నాయని ఎమ్మెల్యే సతీశ్ కుమార్ వ్యాఖ్యా నించడం విచిత్రంగా ఉందని బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి విజయపాల్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన హుస్నాబాద్‌లో విలేకరుల సమావే శంలో మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తా మంటే ప్రతిపక్షాలే అడ్డుకుంటున్నాయన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఎనిమిదేండ్లుగా ఏమీ చేయకుండా నెపం ప్రతిపక్షాలపై నెట్టడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేవరకే గౌరవెల్లి ప్రాజెక్టు పనులు 60 శాతం పూర్త య్యాయని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ కమీషన్ల కోసం రిజర్వాయర్ ఎత్తు పెంచి, ఇక్కడి నిర్వాసితులకు సమస్యలు తెచ్చారన్నారు. ఎనిమిదేండ్లుగా మోసపూరిత మాటలతో ఎమ్మెల్యే కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ ప్రాజెక్టులు పూర్తయినా, గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు పూర్తి కావడంలేదని ప్రశ్నించారు. ఇది పూర్తిగా ఎమ్మెల్యే అసమర్ధతనే అన్నారు. ఎమ్మెల్యే స్థానికేతరుడు కనుకనే ఆయనకు హుస్నాబాద్ నియోజకవర్గంపై పట్టింపు లేదన్నారు. ఆయన పనిచేయకుండా ప్రతిపక్షా లపై నిందలు వేయడం వింతగా ఉందన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వైఖరి మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ హుస్నాబా ద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, అక్కన్నపేట మండల అధ్యక్షుడు వీరాచారి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి సతీశ్, మండల ప్రధాన కార్యదర్శి బొల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.