Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల్లో సమన్వయలోపం
- ఎజెండా చదివి వెళ్లిపోయిన అధికారులు
నవతెలంగాణ-ములుగు
మండల సర్వసభ్య సమావేశంలో తెలిపిన సమ స్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని, అలాం టప్పుడు సమావేశాలు నిర్వహించడమెందుకని సర్పం చ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పెద్దబాల్ లావణ్య అంజన్ గౌడ్ అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమా వేశాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారం భం కావాల్సిన కావలసిన సమావేశం రెండు గంటలు ఆలస్యంగా 12 గంటలకు ప్రారంభం అయింది. అధి కారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి మండల అభివృద్ధికి కషి చేయాలని ఎంపీపీ లావణ్య ఆదేశించారు. గ్రామాలలో విద్యుత్ సమస్య ఉందని సంబంధిత ఏఈకి చెప్పినా పట్టించుకోవడం లేదని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గణేష్ గుప్తా, సర్పంచ్ వెంకటేష్ యాదవ్, సర్పంచ్ బంగ్లా గణేష్ లు అధికా రుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలం లోని వివిధ శాఖల అధికారులు సమన్వయం పాటిం చకపోవడంతో పాటు సరిగ్గా పని చేయడం లేదని సభ దృష్టికి తీసుకెళ్లారు. వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి మాట్లా డుతూ తునికి బొల్లారంలోని పీఏసీఎస్‌లో వడ్లు నింపి పెట్టినా కూడా లారీలు రావడం లేదన్నారు. పీఏసీ ఎస్ ఆధ్వర్యంలో ధాన్యం లోడు చేయగానే రశీదు ఇవ్వా లని వ్యవసాయ అధికారికి తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ తమ ఎజెండాలు చదివి వెళ్లిపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో వంటి మామిడి మార్కెట్ ఛైర్మన్ జహాంగీర్, రైతు సమితి అధ్యక్షులు నర్సింహా రెడ్డి, ఎంపీడీవో వేంకటేశ్వర రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.