Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-జిన్నారం
మండల కేంద్రమైన జిన్నారంలో అగ్నిమాపక కేంద్రం ఎప్పుడు ఏర్పాటు చేస్తారోనంటూ పలువురు చర్చించుకు ంటున్నారు. పారిశ్రామిక మండలంగా పేరున్న ఈ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో కార్మికులు కోరుతున్నారు. కానీ కేంద్రం ఏర్పాటు కార్యరూపం దాల్చ కుండా నేటికీ అర్జీ స్థాయిలోనే ఉండ డంతో మండలంలోని వివిధ గ్రామాల కార్మికులు నిట్టూరుస్తున్నారు. పరిశ్రమ ల్లో ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదా లను తలచుకుంటూనే తమ పరిస్థితి దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు చందంగా మారిందంటూ పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పధానంగా మండలంలోని జిన్నారం, ఐడీఏ బొల్లారం, వావిలాల, గడ్డపో తారం, చెట్ల పోతారం, కాజిపల్లి తది తర ప్రాంతాలలో వివిధ రకాల పరిశ్ర మల్లో వందలాది మంది కార్మికులు పని చేస్తుంటారు. అయితే ఈ పరిశ్ర మల్లో ఇది వరకే పలు అగ్ని ప్రమాదా లు సంభవించి పలువురు కార్మికులు మృతి చెందిన ఘటనలున్నాయి. కానీ ఆ ప్రాంతంలో అగ్ని మాపక కేంద్రం మాత్రం లేదు. దీంతో జిన్నారంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయా లని ఎన్నో సంవత్సరాలుగా కార్మికులు అధికార యంత్రాంగాన్ని కోరుతున్నా రు. దీని వల్ల మండల కేంద్రమైన జి న్నారంతో పాటు ఐడిఏ బొల్లారం ,కాజిపల్లి, గడ్డపోతారంతో పాటుగా అటు బొంతపల్లి ,గుమ్మడిదల ,మంబా పూర్ ,అన్నారం, గాగిల్లాపూర్ ప్రాం తాల పారిశ్రామికవాడలకు ఉపయోగ పడుతుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు .ఇప్పటికైనా అధికారు లు స్పందించి వెంటనే జిన్నారంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని జిన్నారం మండల కార్మిక కుటుంబాలు, స్థానికు లు కోరుతున్నారు.